అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడం, స్థానిక పరిపాలనను మరింత బలపరచడం లక్ష్యంగా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. పంచాయతీలకు నాలుగు రకాల వర్గీకరణ గ్రామ పంచాయతీలను జనాభా మరియు వార్షిక ఆదాయాన్ని ఆధారంగా తీసుకొని నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. అవి రూర్బన్ పంచాయతీలు, గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3 పంచాయతీలు. రూర్బన్ పంచాయతీలు...