ఏపీలో కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ – “ఇంద్రధనుస్సు” పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం

Author

SATHYA VELUGU

Sr Reporter | ఎడిటోరియల్

అమరావతి, మార్చి 4: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. “ఇంద్రధనుస్సు” పథకం కింద 40 శాతం పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఏ బస్సుల్లో ఫ్రీ? ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని APSRTC బస్సుల్లో దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. సాధారణంగా ఈ పథకం వర్తించే ఐదు రకాల బస్సుల్లో పూర్తి ఉచిత సౌకర్యం అందుబాటులో...