ఏపీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 6వ తరగతి ప్రవేశాలు – మార్గదర్శకాలు విడుదల

Author

SATHYA VELUGU

Sr Reporter | Notifications

ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలికలకు ఉచిత నివాసంతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలల్లో ప్రవేశాలు నిర్వహించబడుతున్నాయి. అర్హత కలిగిన బాలికలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన తేదీలు ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 12, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు ఏప్రిల్ 01, 2026 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం...