కరెంట్ షాక్‌తో మరణిస్తే రూ.8 లక్షలు.. ఎక్స్‌గ్రేషియా పెంపు.. 2 నెలల్లోగా చెల్లించాలని ఆదేశాలు

Author

SATHYA VELUGU

Sr Reporter | ఎడిటోరియల్

కరెంట్ షాక్‌తో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను ఈఆర్సీ భారీగా పెంచేసింది. ఇప్పటివరకు విద్యుత్ షాక్‌తో చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఇస్తుండగా.. ఇక నుంచి రూ.8 లక్షలు ఇవ్వనున్నారు. ఈ ఎక్స్‌గ్రేషియా సొమ్మును.. 2 నెలల్లోగా బాధిత కుటుంబాలకు చెల్లించాలని డిస్కంలకు ఆదేశించింది. మరోవైపు.. ఈ ఏడాది విద్యుత్ శాఖలో రూ.15 వేల కోట్లకుపైగా రెవెన్యూ లోటు నమోదైనట్లు తెలిపింది. ఇందులో రూ.14 వేల కోట్ల సబ్సిడీకి సర్కార్ ఆమోదం తెలిపింది.