తిరుపతి నుంచే రైల్వే డివిజనల్ కార్యకలాపాలు నిర్వహించాలి .లోక్‌సభ జీరో అవర్‌లో ఎంపీ గురుమూర్తి డిమాండ్

Author

SATHYA VELUGU

Sr Reporter | అంతర్జాతీయం

తిరుపతి రైల్వే స్టేషన్‌కు సంబంధించిన రైల్వే విభాగ కార్యకలాపాలు ప్రస్తుతం గుంతకల్ నుంచి నిర్వహిస్తున్న నేపథ్యంలో, ప్రయాణికుల అధిక రద్దీ కారణంగా వాటిని కొంతవరకు తిరుపతి నుంచే నిర్వహించాల్సిన అవసరం ఉందని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. తిరుపతి దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉండటంతో పాటు ప్రముఖ విద్యా, వైద్య కేంద్రంగా కూడా నిలిచిందని ఆయన తెలిపారు. తిరుమలకు ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులు వస్తుండటంతో పాటు విశ్వవిద్యాలయాలు, వైద్య విద్యాసంస్థలు ఉండటం...