నాయుడుపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయుడుపేటలోని ECI టౌన్ చర్చ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ఆరాధనలో సంఘ మహిళలు ఉత్సాహంగా పాల్గొని వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్తోత్ర గీతాలు, బైబిల్ వచన పఠనం, ప్రత్యేక ప్రార్థనలు మరియు ఆధ్యాత్మిక సందేశాలు నిర్వహించబడ్డాయి. మహిళలు దేవుని సేవలో, కుటుంబ నిర్మాణంలో మరియు సంఘ అభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి సంఘ దైవ...