నాయుడుపేట: నెప్ ఫెలోషిప్ సేవకుల ఆధ్వర్యంలో నిర్వహించిన “రన్ ఫర్ జీసస్” శాంతి ర్యాలీ ఘనంగా, విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెప్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ Rt. Rev. మైకేల్ బెన్హర్ గారు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏసుప్రభువు ప్రపంచ మానవాళికి రక్షణను అందించడానికి మరియు శాంతిని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చారని సందేశం అందించారు. సమాజంలో ప్రేమ, ఐక్యత, శాంతి విలువలను ప్రతీ ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ Rev. Dr....