శిరసానంబేడు మరియు నాయుడుపేట ప్రాంతాల్లోని న్యూ జెరూసలేం చర్చ్‌లో పామ్ సండే వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా దైవ సేవకులు మురళీధర్ గారు ప్రత్యేక వర్తమానాన్ని అందించి, యేసుక్రీస్తు యెరూషలేములో విజయం తో ప్రవేశించిన సంఘటన ప్రాముఖ్యతను వివరించారు. ప్రార్థనలు, స్తోత్ర గీతాలు మధ్య జరిగిన ఈ ఆరాధనలో అనేక మంది విశ్వాసులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కార్యక్రమం ఘనంగా కొనసాగింది.