sathyavelugu.com
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 10:07 pm Digital Edition : SATHYA VELUGU

పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు లేనన్న కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ | మార్చి 3, 2026 (5:36 PM): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఇటీవల పెరుగుతున్నప్పటికీ, వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో సుమారు 25 రోజుల సరిపడ ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంధన ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ధరల్లో మార్పులు అవసరమైతే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది.
ప్రస్తుతం వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సాధారణంగా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.