న్యూఢిల్లీ | మార్చి 3, 2026 (5:36 PM): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఇటీవల పెరుగుతున్నప్పటికీ, వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో సుమారు 25 రోజుల సరిపడ ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంధన ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం...