వెంకటరెడ్డి పాలెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటరెడ్డి పాలెంలోని థై గ్రేస్ సంఘంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ఆరాధనలో అన్ని కార్యక్రమాలను మహిళలే నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఆరాధనలో స్తోత్ర గీతాలు, ప్రార్థనలు, బైబిల్ వచన పఠనం మరియు సందేశాలతో మహిళలు చురుకుగా పాల్గొన్నారు. మహిళలు సంఘ సేవలో, ఆధ్యాత్మిక జీవితంలో పోషిస్తున్న కీలక పాత్రను ఈ కార్యక్రమం ద్వారా గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలీన మేడం గారు హాజరై మహిళలకు...