sathyavelugu.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 6:27 am Digital Edition : KUMPATI SURESH

ఏపీలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

నేటితో ముగియనున్న పాలకవర్గం గడువు

అమరావతి :

ఏపీ రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో పాలకవర్గం గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గం ఏర్పడే వరకు వీరే పాలన చూసుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్కు జులై 29, మరో 13 పురపాలికల్లో నవంబర్ 21తో గడువు ముగియనుంది. అటు పంచాయతీల్లో ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.