బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి నివాళులు

Author

KUMPATI SURESH

Sr Reporter | ఎడిటోరియల్

తిరుపతి: దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా తిరుపతి పార్లమెంట్ సభ్యుడు ఎం. గురుమూర్తి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు అమోఘమని అన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన, తన జీవితాన్ని సామాజిక సమానత్వానికి అంకితం చేశారని గుర్తుచేశారు. కుల వివక్షను నిర్మూలించడానికి, సమాజంలో ప్రతి ఒక్కరికీ...