రైతులకు భారీ ఊరట.. 108లోనే యాంటీ-స్నేక్ వెనం అందుబాటులోకి! అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగపడే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలోని 108 అంబులెన్స్‌లలోనే పాము కాటుకు ఉపయోగించే యాంటీ-స్నేక్ వెనం (ASV) మందును అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలకు పాము కాటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రికి చేరుకోవడానికి సమయం పట్టే పరిస్థితుల్లో పాము కాటుకు గురైన వ్యక్తికి చికిత్స ఆలస్యం కావడం...