ఆనంద్ మహీంద్రా దంపతుల గొప్ప మనసు.. విద్యాభివృద్ధికి రూ.300 కోట్ల కానుక!

Author

KUMPATI SURESH

Sr Reporter | Education

హైదరాబాద్: విద్యారంగ అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, ఆయన భార్య అనురాధ మహీంద్రా భారీ విరాళం అందించారనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ యూనివర్సిటీకి సుమారు రూ.300 కోట్ల విలువైన షేర్లను విరాళంగా ఇవ్వడానికి వారు ముందుకొచ్చినట్లు సమాచారం. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు ఉన్నత విద్య, పరిశోధన రంగాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని విద్యా సంస్థకు అందించడం పట్ల విద్యావేత్తలు, విద్యార్థులు, పారిశ్రామిక వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి....