ఏపీలో డీఈఓ పోస్టుల భర్తీలో భారీ మార్పులు.. గ్రూప్-1 ద్వారానే నేరుగా నియామకాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖలో కీలక పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జిల్లా విద్యాశాఖ అధికారుల (DEO) నియామక విధానంలో పెద్ద మార్పులు చేస్తూ, ఇకపై గ్రూప్-1 పరీక్ష ద్వారా నేరుగా డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్-1998లో సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఎలా ఉండేది? ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖ అధికారుల పోస్టులు ప్రధానంగా పదోన్నతుల ద్వారా భర్తీ అయ్యేవి. ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) పోస్టులకే నియామకాలు...