అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ఇప్పటికే పూర్తయింది. మరో 13 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం నవంబర్‌లో ముగియనుంది. దీంతో మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బీసీలకు 33.33...