నాయుడుపేట: “Biblical Embryology” అనే అంశంపై సమగ్ర పరిశోధన చేసిన కోట నరసింహారావుకు హైదరాబాద్‌కు చెందిన WORD Bible College ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. బైబిల్ ఆధారంగా జీవం, మానవ ఆవిర్భావం, గర్భస్థ శిశువు రూపకల్పనకు సంబంధించిన అంశాలను పరిశోధించినందుకు ఈ గౌరవం అందించారు. నాయుడుపేటలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కోట నరసింహారావును పలువురు అభినందించారు.