సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు. భార్య వివాహేతర సంబంధంలో ఉందనే విషయాన్ని ప్రాథమిక ఆధారాలతో (Ex-facie evidence) భర్త ప్రాథమిక దశలోనే నిరూపించగలిగితే, ఆమెకు ఇచ్చే మధ్యంతర జీవనభృతిని (Interim Maintenance) నిరాకరించవచ్చని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 125(4) ప్రకారం భర్త దాఖలు చేసిన పిటిషన్‌లో సమర్పించిన ఆధారాలు వ్యభిచార బంధాన్ని ప్రాథమికంగా రుజువు చేస్తున్నప్పుడు, ఆ అంశాన్ని చివరి విచారణ దశ వరకు వేచిచూడకుండా మధ్యంతర దశలోనే నిర్ణయించవచ్చని తేల్చిచెప్పింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్...