హైదరాబాద్: పొత్తికడుపు దిగువ భాగంలో లేదా తొడ-గజ్జల మధ్యలో చిన్న ఉబ్బరం కనిపించడం, దగ్గినప్పుడు లేదా బరువు ఎత్తినప్పుడు నొప్పి రావడం వంటి లక్షణాలు ఉంటే అది వరిబీజం (Inguinal Hernia) కావచ్చు. చాలామందికి వరిబీజం వచ్చినప్పుడు “ఆపరేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలా? మందులతో తగ్గుతుందా?” అనే సందేహం ఉంటుంది. వైద్య సమాచారం ప్రకారం, వరిబీజం అనేది పొత్తికడుపు గోడలో బలహీనమైన ప్రాంతం ద్వారా కొవ్వు కణజాలం లేదా పేగులోని కొంత భాగం బయటకు ఉబ్బినట్లుగా కనిపించే పరిస్థితి. దగ్గడం, మలవిసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి...