వాట్సాప్‌లోనే సదరం సేవలు.. స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ డౌన్‌లోడ్‌కు ఏపీ ప్రభుత్వ కొత్త సౌకర్యం

Author

KUMPATI SURESH

Sr Reporter | అమరావతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత ప్రజలకు చేరువ చేస్తూ మరో కీలక సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దివ్యాంగుల కోసం అత్యంత ముఖ్యమైన సదరం (SADARAM) సేవలను ఇప్పుడు మనమిత్ర (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్ వేదిక ద్వారా అందిస్తోంది. దీంతో సదరం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ డౌన్‌లోడ్ వంటి సేవలను ఇంటి నుంచే మొబైల్ ద్వారా సులభంగా పొందే అవకాశం కల్పించింది. కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు సదరం సేవల కోసం మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామం...