అమరావతి: ప్రజాప్రతినిధి హోదాలో కొనసాగుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యాపార ప్రయోజనాలు పొందడం నిబంధనలకు విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి చౌకధరల దుకాణం (రేషన్ షాప్) డీలర్‌గా ఏకకాలంలో కొనసాగడం చెల్లదని పేర్కొంటూ అధికారులు డీలర్‌షిప్‌ను రద్దు చేసిన నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ చౌకధరల దుకాణం డీలర్ ఇటీవల గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం సంబంధిత అధికారులు ఆయన రేషన్ షాప్ డీలర్ ఆథరైజేషన్‌ను రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సదరు...