sathyavelugu.com
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 11:49 pm Digital Edition : KUMPATI SURESH

సైక్లోన్, భూకంపం, సునామీపై పరిశోధనకు ఎన్. అశోక్ కుమార్‌కు పీహెచ్‌డీ అవార్డు

నాయుడుపేట: “సైక్లోన్, భూకంపం మరియు సునామీ రహస్యం” అనే అంశంపై పరిశోధన చేసిన ఎన్. అశోక్ కుమార్‌కు WORD Bible College ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. ప్రకృతి విపత్తులకు సంబంధించిన కారణాలు, వాటి ప్రభావాలు, మానవ జీవితంపై పడే పరిణామాలను అధ్యయనం చేసినందుకు ఈ అవార్డును అందజేశారు. నాయుడుపేటలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందుకున్న ఎన్. అశోక్ కుమార్‌ను పలువురు అభినందించారు. ప్రకృతి విపత్తులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి పరిశోధనలు ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.