ఏపీ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

Author

KUMPATI SURESH

Sr Reporter | Notifications

అమరావతి, ఆగస్టు 23: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ప్రత్యక్ష నియామక పోస్టులను భర్తీ చేసేందుకు 2026 జాబ్ క్యాలెండర్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామకాలను నాలుగు దశల్లో చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. నాలుగు దశల్లో నియామకాలు ప్రభుత్వం రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే తొలి దశలో 1,523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైనట్లు సమాచారం. రెండో దశలో 3,231 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్లు...