ఉడకబెట్టిన మొక్కజొన్న లేదా కాల్చిన కంకి.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు?

Author

KUMPATI SURESH

Sr Reporter | ఆరోగ్యం

మొక్కజొన్న అంటే చాలామందికి వర్షాకాలం, చలికాలంలో రోడ్డుపక్కన కాల్చిన కంకి గుర్తుకొస్తుంది. కొందరు ఇంట్లో నీటిలో ఉడకబెట్టుకుని తింటారు. అయితే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఉడకబెట్టిన మొక్కజొన్నలో పోషకాలు ఎక్కువగా ఉంటాయా? లేక కాల్చిన కంకిలోనే ఎక్కువ పోషక విలువ ఉంటుందా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి ఉడకబెట్టడం, కాల్చడం రెండింటికీ కొన్ని ప్రయోజనాలు, కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏది ఆరోగ్యకరం అనేది కేవలం వంట పద్ధతిపైనే కాకుండా, ఎంత మోతాదులో తింటున్నారు, ఉప్పు-వెన్న-నూనె ఎంత కలుపుతున్నారు, మొక్కజొన్న రకం...