తిరుపతి: రాయలసీమకు కేటాయించిన ప్రతిష్టాత్మక విద్యా, వైద్య సంస్థలను అమరావతికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు. ఇందులో భాగంగానే తిరుపతిలో ఏర్పాటు చేయాల్సిన నైలెట్ శాశ్వత క్యాంపస్‌ను అమరావతికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో నైలెట్ ఏర్పాటుకు గతంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి కృషి చేశామని, శాశ్వత క్యాంపస్ ఏర్పాటుపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇప్పటికే విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్న తిరుపతి ప్రాంతంలో నైలెట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నైలెట్...