హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి, భారతరత్న స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశానికి ప్రణబ్ ముఖర్జీ అందించిన విశిష్ట సేవలను సీఎం స్మరించుకున్నారు. ప్రజాజీవితంలో ఆయన చేసిన అమూల్యమైన కృషి, దేశ పరిపాలనలో పోషించిన కీలక పాత్రను ముఖ్యమంత్రి గుర్తుచేశారు. భారత రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీది ప్రత్యేకమైన స్థానమని పేర్కొంటూ, ఆయన సేవలు, అనుభవం, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ...