అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ అమరావతి మూడు దశల్లో ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. 29 ప్రధాన డిమాండ్ల సాధన కోసం దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల బకాయిలు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్, డీఏలు తదితర అంశాలు ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి. 🔴 తొలి దశ: ఆగస్టు 31 – సెప్టెంబర్ 11 ఆగస్టు 31: జిల్లా కలెక్టర్లకు పీజీఆర్ఎస్ ద్వారా వినతిపత్రాలు/ఉద్యమ నోటీసులు. సెప్టెంబర్ 1: “సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి” నినాదంతో...