సదరం ఇక సులభం.. మొబైల్‌ ఫోన్‌తోనే స్లాట్‌ బుకింగ్‌!

Author

KUMPATI SURESH

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

అమరావతి, ఆగస్టు 29: దివ్యాంగులకు సంబంధించిన సదరం (SADAREM) సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. సదరం సర్టిఫికెట్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌, స్లాట్‌ లభ్యత తెలుసుకోవడం, సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ వంటి సేవలను ‘మనమిత్ర’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌లోనే పొందే అవకాశం కల్పించింది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు సదరం స్లాట్‌ బుకింగ్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాలు లేదా ఇతర కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చేది. తాజా డిజిటల్‌ సదుపాయంతో ఈ ప్రక్రియను మరింత సులభతరం చేశారు....