సత్య వెలుగు | ఆంధ్రప్రదేశ్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరుతో సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వైరల్ అవుతున్న సమాచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా నకిలీదని, దానిని ఎవరూ నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న షెడ్యూల్ ఫేక్ ఎన్నికల సంఘం అధికారిక చిహ్నాలు, లోగోలను ఉపయోగించి కొందరు ఉద్దేశపూర్వకంగా నకిలీ షెడ్యూల్‌ను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం...