సెప్టెంబర్ 13 వరకు అవకాశం.. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కేంద్రం పిలుపు న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశంలో నిర్వహించే ప్రభుత్వ పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, విద్యార్థులకు అనుకూలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు కోరుతోంది. నందన్ నీలేకని అధ్యక్షతన ఏర్పాటు చేసిన హై-పవర్డ్ టాస్క్‌ఫోర్స్ (HPTF) ఈ ప్రజా సంప్రదింపులను నిర్వహిస్తోంది. పరీక్షల నిర్వహణ, భద్రత, ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకన విధానం, పరీక్షల్లో అక్రమాలను నివారించడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పరీక్షా కేంద్రాల మౌలిక సదుపాయాలు, పారదర్శకత, ఫిర్యాదుల పరిష్కారం...