ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. అర్హుల ఎంపిక, దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక ప్రక్రియను అమలు చేయనుంది. 3 లక్షల మందికి కొత్త పింఛన్లు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3,00,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తొలివిడతలో వృద్ధులు, వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో దరఖాస్తుల ప్రక్రియ కొత్త పింఛన్ల కోసం సెప్టెంబర్ రెండో వారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమై, అక్టోబర్ నుంచి...