అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొంటోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద సంఖ్యలో గృహ నిర్మాణాలకు అనుమతులు సాధించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేయడానికి ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారం పది రోజుల్లో కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం 1.0 కింద గతంలో రాష్ట్రానికి దాదాపు 19...