ఫేక్ ఐడీతో వేధిస్తున్నారా? ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే!

Author

KUMPATI SURESH

Sr Reporter | ఇంటర్నేషనల్

సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలతో వేధింపులు.. పరువు తీసే పోస్టులు, బెదిరింపులు, అసభ్య సందేశాలపై కఠిన చర్యలకు అవకాశం అమరావతి: సోషల్ మీడియా వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు కూడా పెరుగుతున్నాయి. కొందరు వ్యక్తులు తమ అసలు గుర్తింపును దాచిపెట్టి ఫేక్ ఐడీలను సృష్టించి ఇతరులను వేధించడం, అవమానించడం, బెదిరించడం, తప్పుడు ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత కక్షలు, ఆర్థిక వివాదాలు, ప్రేమ వ్యవహారాలు, రాజకీయ విభేదాలు లేదా ఇతర కారణాలతో ఫేక్ అకౌంట్లను దుర్వినియోగం...