మార్కాపురం: ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కీలక దశకు చేరుకుంది. 1996లో శంకుస్థాపన వెలిగొండ ప్రాజెక్టుకు 1996 మార్చి 5న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కరువు ప్రాంత రైతుల సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. 2004–05లో పనులకు శ్రీకారం ప్రాజెక్టుకు 2004లో పరిపాలనా అనుమతులు...