సత్య వెలుగు | ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రతిపాదన చేశారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. దక్షిణ భారతదేశంలోని ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి సంపదను సమగ్రంగా అనుసంధానిస్తూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉమ్మడి పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ క్షేత్రాలు, సముద్రతీరాలు, ప్రకృతి అందాలు ఉన్నాయని...