న్యూఢిల్లీ, ఆగస్టు 20: లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరు మేజర్, పరస్పర సమ్మతితో ఉన్న వ్యక్తులకు తమ భాగస్వామిని ఎంచుకుని కలిసి జీవించే హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి సంబంధం చట్టపరంగా వివాహంతో సమానం కాకపోయినా, రాజ్యాంగ పరిరక్షణ పరంగా వివాహాన్ని పోలి ఉంటుందని కోర్టు పేర్కొంది. కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న ఓ లివ్-ఇన్ జంట దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సౌరభ్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో కలిసి జీవిస్తున్న మేజర్...