LPG గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. e-KYC చేయకపోతే సబ్సిడీ నిలిచిపోవచ్చు! పూర్తి వివరాలు ఇవే

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక హెచ్చరిక జారీ చేశాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద గ్యాస్ సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారులు తప్పనిసరిగా e-KYC (ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ) పూర్తి చేయాలని సూచించాయి. నిర్ణయించిన గడువులోపు e-KYC పూర్తి చేయకపోతే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్యాస్ సబ్సిడీ నిలిపివేయబడే అవకాశం ఉందని వెల్లడించాయి. ఎందుకు e-KYC తప్పనిసరి? గ్యాస్ సబ్సిడీ సరైన లబ్ధిదారులకు మాత్రమే అందేలా కేంద్ర ప్రభుత్వం ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. దీంతో నకిలీ కనెక్షన్లు, అనర్హుల పేర్లపై సబ్సిడీలు నిలిపివేయడం లక్ష్యంగా...