పండ్లూరు: దోనేపర్తి పండ్లూరమ్మ 5వ వర్ధంతిని పురస్కరించుకుని దోనేపర్తి పండ్లూరమ్మ – చెంగయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లూరు గ్రామంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పండ్లూరమ్మ జ్ఞాపకాలను స్మరించుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలను చేపట్టడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా మేడిప్లస్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు యువత, గ్రామస్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఈ రక్తదానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని...