గ్రామాల్లో పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా.. 27.70 శాతానికి చేరిక

Author

KUMPATI SURESH

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

సత్య వెలుగు | ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం పెరిగినట్లు సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా 25.85 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 27.70 శాతానికి చేరినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ మార్పు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వర్గాల జనాభా నిర్మాణంలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రతిబింబిస్తోంది. కోటి మందికి పైగా ఎస్సీ, ఎస్టీలు సమగ్ర కుటుంబ సర్వే వివరాల ప్రకారం...