UPIతో చెల్లింపులు చేస్తే అదనపు ఛార్జీలా? అసలు నిజం ఏంటి?

Author

KUMPATI SURESH

Sr Reporter | ఎడిటోరియల్

UPI చెల్లింపులపై ఛార్జీలు.. నిజాలు ఇవే! దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో యూపీఐ (UPI) లావాదేవీలపై మళ్లీ చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో "UPI ద్వారా చెల్లిస్తే అదనపు ఛార్జీలు విధించబోతున్నారు" అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో సాధారణ ప్రజల్లో అయోమయం నెలకొంది. అయితే ప్రస్తుతం సాధారణ వినియోగదారులు బ్యాంకు ఖాతా నుంచి బ్యాంకు ఖాతాకు చేసే UPI చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు లేవు. అంటే దుకాణంలో QR కోడ్ స్కాన్ చేసి లేదా వ్యక్తికి నేరుగా డబ్బు పంపినా...