sathyavelugu.com
Date of Publish : 18 September 2026, 7:34 pm Posted by : suneelsagilala@gmail.com

లద్దిగం చేపల చెరువు వేలంలో రూ.2.91 లక్షల పాట

 

చౌడేపల్లి, సెప్టెంబర్ 18 (సత్య వెలుగు న్యూస్):

చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం చేపల చెరువు బహిరంగ వేలం నిర్వహించారు. 1436 ఫసలీకి సర్కారు పాటను రూ.70 వేలుగా నిర్ణయించారు. తీవ్ర పోటీ నెలకొనగా లద్దిగం గ్రామానికి చెందిన ముజామిల్ సాహెబ్ రూ.2.91 లక్షలకు వేలం పాట పాడి అత్యధిక పాటదారునిగా నిలిచారు. అధికారులు, సాగునీటి సంఘం అధ్యక్షుడు, స్థానిక నాయకులు, ప్రజల సమక్షంలో వేలం నిర్వహించినట్లు డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ తెలిపారు.