102 ఆర్టీఐ అప్పీళ్లను కొట్టివేసిన సమాచార కమిషన్
అమరావతి, సెప్టెంబర్ 19: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కదరంపల్లికి చెందిన బి. గోపాల్ దాఖలు చేసిన 102 ఆర్టీఐ అప్పీల్ కేసులను ఏపీ రాష్ట్ర సమాచార కమిషన్ బ్యాచ్ కేసులుగా విచారించి తుది ఉత్తర్వులు జారీ చేసింది. పునరావృతంగా దరఖాస్తులు, అప్పీళ్లు దాఖలు చేయడం వల్ల ప్రజా సంస్థల సమయం, వనరులపై అదనపు భారం పడుతోందని కమిషన్ పేర్కొంది. ఇప్పటికే సమాధానం అందిన అంశాలపై మళ్లీ దరఖాస్తులు చేస్తే గతంలో ఇచ్చిన సమాధానాన్ని తెలియజేస్తూ తిరస్కరించవచ్చని స్పష్టం చేసింది. అప్పీలుదారుపై వచ్చిన డబ్బుల...