వీఆర్ఏలకు 70% పదోన్నతులు కల్పించాలి: జేఏసీ

దొరవారిసత్రం, సెప్టెంబర్ 21 | సత్య వెలుగు న్యూస్ వీఆర్ఏలకు న్యాయబద్ధమైన పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ యూనియన్ ప్రతినిధులు తహసీల్దార్ రాజేంద్రకు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు వీఆర్వో పోస్టుల్లో 70 శాతం పదోన్నతులు కల్పించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడతామని జేఏసీ జిల్లా కార్యదర్శి బల్లి విజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పాల గిరిజ కళ్యాణి, మండల అధ్యక్షుడు తుమ్మ జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.