కొత్త పింఛన్లకు తొలిరోజే 75 వేల దరఖాస్తులు
అమరావతి: ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త పింఛన్ల కోసం తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా 75 వేల దరఖాస్తులు వచ్చాయి. సోమవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తుదారులు సచివాలయాల వద్ద బారులు తీరారు. ఒకేసారి అధిక సంఖ్యలో దరఖాస్తులు చేయడంతో సర్వర్ నెమ్మదించినట్లు అధికారులు తెలిపారు.