పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్: మిట్ట హరిజనవాడ ఎగువ ప్రాంతంలోని సుమారు 3.5 ఎకరాల పబ్లిక్ సర్వీస్ భూమి కబ్జాకు గురైందని మాజీ ఎన్‌డీసీసీబీ చైర్మన్, చిల్లకూరు గ్రామ కాపురస్తుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పెళ్లకూరు ఎంపీడీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
35 ఎకరాల లేఅవుట్‌లో నిబంధనల ప్రకారం ప్రజా అవసరాల కోసం కేటాయించిన 3.5 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందని తెలిపారు.
భూమిపై సమగ్ర విచారణ జరిపి, ఆక్రమణకు గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని గ్రామ ప్రజల అవసరాలకు వినియోగించాలని ఎంపీడీవోను కోరారు.