రూ.8 కోట్ల పంచాయతీ భూమి కబ్జా ఆరోపణలు

పెళ్లకూరు,  సత్య వెలుగు న్యూస్: మిట్ట హరిజనవాడ ఎగువ ప్రాంతంలోని సుమారు 3.5 ఎకరాల పబ్లిక్ సర్వీస్ భూమి కబ్జాకు గురైందని మాజీ ఎన్‌డీసీసీబీ చైర్మన్, చిల్లకూరు గ్రామ కాపురస్తుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పెళ్లకూరు ఎంపీడీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 35 ఎకరాల లేఅవుట్‌లో నిబంధనల ప్రకారం ప్రజా అవసరాల కోసం కేటాయించిన 3.5 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందని తెలిపారు. భూమిపై సమగ్ర విచారణ...