పోలవరం ఎడమ కాలువతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ,రూ.4,192 కోట్లతో కీలక ప్రాజెక్టు.. సాగు, తాగునీరు, పరిశ్రమలకు ఊతం

అమరావతి, సెప్టెంబర్ 3: పోలవరం ప్రాజెక్టులో భాగమైన ఎడమ కాలువ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. సుమారు రూ.4,192 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులు పూర్తయితే ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందుబాటులోకి రావడంతో పాటు వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభించనుంది. లక్షల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం ప్రాజెక్టు ద్వారా సుమారు 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు 5.23 లక్షల మందికి తాగునీటి ప్రయోజనం కల్పించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించినట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. అలాగే విశాఖ పరిసర...