ఈ రాత్రికి తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల వైపు వేగంగా కదులుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం సెప్టెంబర్ 23 రాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 55–65 కి.మీ వేగంతో గాలులు, గరిష్ఠంగా 75 కి.మీ వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు...