ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలు.. ఆకాశంలోకి ఎగిసిన లావా

[video width="360" height="640" mp4="https://sathyavelugu.com/wp-content/uploads/2026/09/WhatsApp-Video-2026-09-08-at-10.13.52-PM.mp4"][/video] ఇండోనేషియాలోని అనక్ క్రకటోవా (Anak Krakatau) అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది. సెప్టెంబర్ 9 తెల్లవారుజామున జరిగిన ఈ విస్ఫోటనంతో అగ్నిపర్వతం నుంచి వేడి లావా, బూడిద, అగ్నికణాలు వెలువడ్డాయి. విస్ఫోటన దృశ్యాలు తీవ్ర భయానకంగా కనిపించాయి. ఇండోనేషియా అగ్నిపర్వత, భౌగోళిక విపత్తుల పర్యవేక్షణ సంస్థ (PVMBG) ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 12:47 గంటలకు విస్ఫోటనం సంభవించింది. సుమారు 28 సెకన్ల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. విస్ఫోటనం సమయంలో భూకంప ప్రకంపనల తీవ్రత గరిష్ఠంగా...